తాజా అత్తి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి అల్పాహారంగానూ, సలాడ్లు లేదా డెజర్ట్‌లగా తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తినాలి. తాజా అత్తి పండ్లు తిన్నవారికి మలబద్ధకం సమస్య ఇట్టే పోతుంది.
అత్తిపండ్లు అధికంగా తీసుకుంటే..?
అత్తి పండ్లను అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇవి కొన్నిసార్లు మలబద్దకానికి ఇంటి నివారణగా ఉపయోగించబడుతున్నందున, అత్తి పండ్లలో విరేచనాలు లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉండవచ్చు. అత్తి పండ్లలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం పలుచబడేట్లు చేస్తుంది. అందువల్ల అత్తిపండ్లను ఓ మోస్తరికి మించి తీసుకోరాదు.