తాజాగా అమితాబ్ ఆరోగ్యం గురించి నానావతి ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ... ఆయన టెస్టు రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నాయనీ పేర్కొన్నాయి. బ్లడ్, సీటీ స్కాన్ రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.
మరోవైపు, అమితాబ్‌కు ఇంకా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదనీ, తనకు కరోనా నెగెటివ్ అంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అమితాబ్ కుటుంబ సభ్యులు స్పందించాల్సివుంది.