కళ్లకి డయాబెటిస్ వ్యాధి ఎలాంటి సమస్యలు తెస్తుంది?

శుక్రవారం, 29 డిశెంబరు 2023 (23:12 IST)
మధుమేహం కారణంగా అనేక రకాల వ్యాధులు సంభవించడం ప్రారంభిస్తాయి. అయితే శరీరంలో ఎక్కువగా ప్రభావితమయ్యేవి కండ్లు. వీటికి డయాబెటిస్ వ్యాధి ఎలాంటి సమస్యలు తెస్తుందో చూద్దాము. మధుమేహం కంటికి చాలా హాని కలిగిస్తుంది. మధుమేహం వల్ల వచ్చే కంటి సమస్యలను డయాబెటిక్ రెటినోపతి అంటారు.
 
ఈ సమస్య దృష్టి సమస్యలు లేదా అంధత్వానికి కారణం కావచ్చు. అంతేకాకుండా ఇది కంటి రక్త నాళాలను కూడా దెబ్బతీస్తుంది. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కళ్లలో వాపు సమస్య రావచ్చు.
 
కళ్ల నుంచి విపరీతంగా నీరు కారడంతో పాటు వాపు కూడా రావచ్చు. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కళ్లలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇది అస్పష్టమైన దృష్టి లేదా అంధత్వానికి కారణం కావచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు