బాదములు తింటే అద్భుతమైన ఫిట్‌నెస్‌

సోమవారం, 16 జనవరి 2023 (18:53 IST)
వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవాటుపడుతుంది. కానీ, ఈ వ్యాయామాలను సరిగ్గా చేసినప్పటికీ  నీరసం మరియు కండరాలకు నష్టం కలిగిస్తుంది. వ్యాయామాల వల్ల కలిగే అలసట నుంచి కోలుకోవడం ముఖ్యం. ఎందుకంటే, వ్యాయామా కారణంగా మజిల్‌ పొందడంతో పాటుగా కొంతకాలానికి ఫిట్‌నెస్‌ సైతం మెరగుపడుతుంది. అప్పుడప్పుడూ వ్యాయాయాలు చేసే వ్యక్తులను కూడా మిళితం చేసి  (వారానికి మూడు సార్లు కంటే తక్కువ) నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం బాదముల కారణంగా అలసట మరియు ఆందోళన తగ్గి, రికవరీ సమయంలో లెగ్‌, లోయర్‌ బ్యాక్‌ బలం కూడా పెరుగుతుంది మరియు తొలి రోజు రికవరీ వేళ కండరాలు నష్టపోకుండా కూడా కాపాడుతుంది.
 
డేవిడ్‌ సీ నీమాన్‌, డీఆర్‌పీహెచ్‌, ఎఫ్‌ఏసీఎస్‌ఎం, ప్రొఫెసర్‌ మరియు ప్రిన్సినల్‌ ఇన్వెస్టిగేటర్‌, హ్యూమన్‌ పెర్‌ఫార్మెన్స్‌ లేబరేటరీ, అప్పలచైన్‌ స్టేట్‌ యూనివర్శిటీ,ఈ వినూత్నమైన పరిశోధనకు నేతృత్వం వహించారు. ఈ అధ్యయనానికి ఫండింగ్‌ను ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా చేసింది. డాక్టర్‌ నీమాన్‌ యొక్క బృందం ఓ బాదం స్నాక్‌తో అత్యున్నతమైన కార్బోహైడ్రేట్‌ సెరల్‌ బార్‌ స్నాక్‌తో సరిపోల్చి 90 నిమిషాల వ్యాయమ వ్యవధిలో పెద్దలు రికవరీ అవుతున్నారా లేదా తెలుసుకోవాలనుకున్నారు.
 
‘‘మేము కనుగొన్నది ఏమిటంటే , బాదములు ఖచ్చితంగా స్పోర్ట్స్‌ న్యూటిషన్‌లో భాగం చేసుకోవాలి. దీనిద్వారా వ్యాయామాల వల్ల కలిగే సమస్యలనుంచి ప్రజలు త్వరగా కోలుకుంటారు’’ అని డాక్టర్‌ నీమాన్‌ అన్నారు. ‘‘ఫిట్‌నెస్‌ కోసం చక్కటి ఆహారం బాదములు. వ్యాయామాల కోసం తగిన శక్తి దగ్గరకు వచ్చేసరికి కార్బ్స్‌ గురించి అందరూ చెబుతారు. కానీ , బాదములు న్యూట్రిషన్‌ ప్యాకేజీలా ఉంటాయి. వీటిలో చక్కటి అన్‌శాచురేటెడ్‌  ఫ్యాట్స్‌, యాంటి ఆక్సిడెంట్‌ విటమిన్‌ ఈ, ఫ్రాంతోసైనిడిన్స్‌ ( పాలిఫెరాల్స్‌లో విభాగం, మొక్కలలో ఇవి రక్షణగా ఉపయోగపడతాయి) వంటివి మా అధ్యయనంలో  శరీరానికి తగిన ప్రయోజనాలు అందిసున్నాయని వెల్లడైంది. ఒక సారి బాదం అందిస్తే (28 గ్రాములు సుమారు) దానిలో 13 గ్రాములు మంచి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌ మరియు కేవలం 1 గ్రాము శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటుంది.’’
 
స్టడీ డిజైన్‌
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 64 మంది ఆరోగ్యవంతులైన పెద్దవారిని ఎంచుకున్నారు. వీరి సరాసరి వయసు 46 సంవత్సరాలు. వీరిలో వారానికి మూడుసార్లు కంటే తక్కువ సార్లు వ్యాయామాలను చేసే వారిని కూడా ఎంచుకున్నారు.ఈ పరిశోధనలో ర్యాండమైజ్డ్‌, పారలల్‌ గ్రూప్‌ డిజైన్‌ వినియోగించారు. ఇక్కడ పాల్గొన్నవారిలో ట్రీట్‌మెంట్‌ పార్టిస్పెంట్స్‌ (ఎన్‌=33) 57 గ్రాములు (రెండు ఔన్సులు) బాదములు ప్రతి రోజూ తీసుకుంటున్నారు. ఈ బాదములను ఉదయం , మధ్యాహ్న సమయాలలో వారు 4 వారాల పాటు తీసుకున్నారు. కంట్రోల్‌ పార్టిస్పెంట్స్‌ (ఎన్‌ =31) అంతే కేలరీలు మ్యాచ్‌ కాగలిన సెరల్‌ బార్‌ను తగిన మోతాదుల్లో తీసుకుంటున్నారు.
 
ఈ పార్టిస్పెంట్స్‌ బ్లడ్‌, యూరిన్‌ నమూనాలను పరీక్షించారు. దీనితో పాటుగా మూడ్‌, మజిల్‌ సోర్‌నెస్‌ ప్రశ్నావళి కూడా అందించారు. ఎత్తు, బరువు, శరీర ప్రమాణాలు కూడా గుణించారు, ఆ తరువాత, ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులకు మజిల్‌ ఫంక్షన్‌ పరీక్షలు (వ్యాయామాలు) చేయాల్సిందిగా సూచించారు. వారి  వ్యాయామాలు  పూర్తయిన తరువాత, వారికి 4 వారాల సప్లిమెంటేషన్‌ పీరియడ్‌ను బాదములు లేదంటే సెరల్‌ బార్స్‌ తీసుకునేందుకు అనుమతించారు. ఈ నాలుగు వారాలు ముగిసిన తరువాత పార్టిస్పెంట్స్‌ యొక్క డైటరీ ఇన్‌టేక్‌ రికార్డులు, బ్లడ్‌, యూరిన్‌ నమూనాల మరియు మరో సెట్‌ ప్రశ్నావళి అందించారు. మజిల్‌ ఫంక్షన్‌ పరీక్షలను మరోమారు చేయడంతో పాటుగా ఆ తరువాత పాటుగా పార్టిస్పెంట్స్‌కు 17 విభిన్న వ్యాయామాలతో కూడిన 90 నిమిషాల ఎక్సర్‌సైజ్‌ బౌట్స్‌ చేయమన్నారు.
 
ఎస్సెంట్రిక్‌ వ్యాయామాలలో నెమ్మదిగా నేలమీదకు వంగడం, స్క్వాట్‌లో భాగంగా కిందకు వంగడం, ఫుషప్‌ సమయంలో కిందకు వంగడ వంటివి ఉన్నాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులకు ఆ తరువాత రోజు మరోమారు బ్లడ్‌, యూరిన్‌ నమూనాలు ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటుగా ప్రశ్నావళిని సైతం అందించారు.  పరిశోధకులు ప్లాస్మా ఆక్సిలిపిన్స్‌లో మార్పులు గమనించారు. ఇవి బయోయాక్టివ్‌, ఆక్సిడైజ్డ్‌ లిపిడ్స్‌గా ఉండటంతో పాటుగా వ్యాయామాల తరువాత శరీర స్ధితిలో కూడా భాగంగా ఉంటాయి. అలాగే ప్లాస్మా సైటోకిన్స్‌, మజిల్‌ డ్యామేజీ బయో మార్కర్లు, మూడ్‌ స్ధితి, వ్యాయాయ పెర్‌ఫార్మెన్స్‌ కూడా పరిశీలించారు.
 
ఫలితాలు
బాదములు తిన్న వ్యక్తులు ఈ దిగువ స్ధితిని అనుభవించారు
 
తిన్న తరువాత అలసట మరియు ఒత్తిడి తగ్గింది. అలాగే అత్యున్నత స్థాయిలో లెగ్‌, లోయర్‌ బ్యాక్‌ స్ట్రెంగ్త్‌ కూడా పెరిగింది.
 
సెరమ్‌ క్రియాటిన్‌ కినేజ్‌ స్థాయిలు కూడా తగ్గాయి. ఇది మజిల్‌ డ్యామేజీ మార్కర్‌. తక్షణ మరియు ఒకరోజు వ్యాయామం తరువాత ఇది కనిపించింది.
 
ఆక్సిలిపిన్‌ అత్యున్నత స్ధాయిలో కనిపించింది (మజిల్‌ ఫంక్షన్‌, రికవరీ, ఫ్యాట్‌ బర్న్‌కు కారణమయ్యే మాలిక్యుల్‌) 12, 13 డిహోమ్‌ మరియు అతి తక్కువ స్ధాయి ఆక్సిలిపిన్‌ 9-10 డిహోమ్‌ కనిపించింది.
 
పెద్దప్రేగులో ఫెనోలిక్స్‌ యొక్క వృద్ధిచెందిన యూరిన్‌స్ధాయి కనిపించింది (బాదముల నుంచి పాలిఫీనాల్స్‌ సూచించడమనైది మరియు పాలీఫెనాల్స్‌ సహజసిద్ధంగానే ప్లాంట్‌ కాంపౌండ్స్‌. ఇవి మొక్కలను కాపాడటంతో పాటుగా మానవ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
 
ఇంటర్వెన్షన్‌ తరువాత కొద్దిపాటి మెరుగుదల కనిపించింది.
ఈ ఆక్సిలిపిన్‌ కనుగొనడం గురించి డాక్టర్‌ నీమాన్‌ వివరిస్తూ ‘‘ ఆక్సిలిపిన్స్‌ సాధారణంగా వ్యాయామాల సమయంలో సృష్టించబడుతుంది. కొన్ని ఆక్సిలిపిన్స్‌‌ను చక్కటి ప్లేయర్స్‌గా భావిస్తుంటారు. వీటిలో 12, 13 డీహోమ్‌ ఉన్నాయి. ఇవి కండరాలు, కొవ్వును వ్యాయామాల సమయంలో కరిగించేందుకు తోడ్పడుతుంది. ఇతర ఆక్సిలిపిన్స్‌ ప్రో ఇన్‌ఫ్లామ్మటరీగా ఉండటంతో పాటుగా ఆరోగ్యం కంటే మరింత ప్రమాదం కలిగిస్తాయి. అవి 9, 10 డిహోమ్‌, ఓ బాడ్‌ ప్లేయర్‌ అది. ఈ బాడ్‌ ఆక్సిలిపిన్స్‌ కారణంగా మజిల్‌ ఫంక్షన్‌ తగ్గుతుంది. అది కొన్ని రకాల వ్యాధుల స్ధితిలలో పెరుగుతుంది. బాదములు తిన్నవారిలో అతి తక్కువగా 9,10 డిహోమ్‌  కంట్రోల్‌ గ్రూప్‌తో పోలిస్తే ఉంది’’ అని అన్నారు.
 
ఈ అధ్యయన ఫలితాలు కేవలం పొగతాగని వ్యక్తులకు మాత్రమే పరిమితం. అది కూడా ఊబకాయం లేకుండా అప్పుడప్పుడూ అయినా వ్యాయామాలు చేస్తూ ఉన్నవారికి వర్తించగలవు . అందువల్ల ఈ ఫలితాలను విభిన్నరకాల వ్యక్తులు, ఆరోగ్య స్థితికి సామాన్యీకరించడం జరగదు. ఒక ఔన్స్‌ (28 గ్రాములు) బాదములు 4 గ్రాములు (14%డీవీ) ఫైబర్‌ మరియు 15 అత్యంత కీలకమైన పోషకాలు అందిస్తాయి. వీటిలో మెగ్నీషియం 77ఎంజీ(20%డీవీ), 210 ఎంజీ(4%డీవీ), పొటాషియం  మరియు 7.27 ఎంజీ(50% డీవీ) ఉంటాయి. అందువల్ల శారీరక ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకోవడానికి అత్యంత  ఖచ్చితమైన న్యూట్రియంట్‌గా ఇది నిలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు