బెండకాయలో జిగురు పోవాలంటే.. వంకాయ కూరలో పాలు పోస్తే?

గురువారం, 16 ఫిబ్రవరి 2023 (19:34 IST)
బెండకాయ వేయిస్తున్నప్పుడు బాగా జిగురుగా వుంటుంది. కడాయిలో ముక్కలు వేయగానే కొంచెం మజ్జిగ కూడా వేసి కలిపితే జిగురు రాదు. బెండకాయలు కడిగిన తర్వాత ఆరబెట్టి కోస్తే తీగలు సాగకుండా వుంటాయి.
 
ఇంకా రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం పెరుగు వేస్తే బెండకాయ కూరలో జిగురు పోతుంది. వంకాయ కూరలో ఒక స్పూన్ పాలు వేసి ఉడికిస్తే ముక్కలు నల్లబడవు. 
 
ఎండురొబ్బరి చిప్ప కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ చేస్తే పప్పు పాడు కాదు. కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పురాసి, నీళ్లు చల్లి గంట సేపు వుంచితే చేదు పోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు