శరీరంలోని నీటిని వెలివేయాలంటే.. విటమిన్ బీ6 తప్పకుండా కావాలి. ఈ విటమిన్ పప్పు, చేపలు, డ్రై ఫ్రూట్స్, పాలకూరల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు అరటి పండ్లు, అవకాడోలు, బీన్స్, పాలకూర వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటికి పోతుంది.
నట్స్, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం మంచిది. నీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పంచదార, పిండి పదార్థాలు, ఉప్పు తీసుకోకూడదు. ఇంకా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో నిల్వ అయ్యే అధిక నీటి సమస్య నుంచి బయట పడవచ్చు.