ప్రపంచ హృదయ దినోత్సవం: ఆరోగ్యకరమైన గుండె కోసం కొన్ని కోట్స్...

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (11:10 IST)
World Heart Day 2020
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకుంటున్నారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ప్రపంచ హృదయ దినోత్సవ ఉద్దేశం. ఈ సంవత్సరం, కోవిడ్ 19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణ రంగంలో చర్చనీయాంశమైంది. 
 
ఇది ఆరోగ్య సంరక్షణ వృత్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కోవిడ్‌పై పోరాటానికి ఏకమయ్యాయి. ఆరోగ్యం పట్ల వ్యక్తిగత బాధ్యతలను గుర్తు చేశాయి. కోవిడ్ కారణంగా ఎంత హాని కలిగి ఉన్నాం. హృదయ సంబంధ వ్యాధులకు, కోవిడ్-19ల మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు కూడా తేల్చాయి. అందువల్ల, గుండెను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైనది.
 
* హృదయం ఆరోగ్యంగా వుండాలంటే ఎప్పుడూ నవ్వుతూ వుండాలి. 
* మీ హృదయాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడానికి ఉత్తమ మార్గం సరైన ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడికి దూరంగా వుండటం.
* హృదయ పరీక్షల చేయించుకోవడం.. ఆరోగ్యంగా హృదయాన్ని వుంచుకోవాలని, సంతోషంగా జీవించమని వాగ్దానం చేయడం ద్వారా ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుందాం. మీకు ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నవ్వుతూ ఉండండి. సంతోషంగా ఉండండి. ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు.
 
* ఈ ప్రపంచ హృదయ దినోత్సవం రోజున, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను గుండె పరిరక్షణ చర్యలు తీసుకుంటామని వాగ్ధానం చేయండి.
* హృదయనాళ సమస్యలను తరిమికొట్టడానికి హృద్రోగ పరీక్షలు చేయించుకోండి. 
* ఆరోగ్యకరమైన, చురుకైన జీవితం ఎల్లప్పుడూ మీ హృదయానికి మేలు చేస్తుంది.
 
* మీ హృదయానికి సంబంధించిన సమస్యలను ఎప్పుడూ విస్మరించవద్దు. ఇది భవిష్యత్తులో ఖరీదైనదని రుజువు చేస్తుంది.
* మీకు ఎటువంటి సమస్యలు లేకుండా కొట్టుకునే గుండె ఉంటే మీరు ఎక్కువ కాలం మరియు ఆరోగ్యంగా జీవిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు