గుండెపోటును నిరోధించే టమేటో మాత్ర

ఎర్రెర్రని టమేటో పండు హృదయానికి ఆయుష్షును పెంచే దివ్యౌషధం అని తమ పరిశోధనల్లో తేలిందంటున్నారు వైద్యులు. ఈ పండుపై కొన్ని సంవత్సరాలపాటు సుదీర్ఘమైన పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞులు దీనికి గుండెపోటును నిరోధించే శక్తి ఉందని కనుగొన్నారు.

టమేటో పైన ఉండే ఎర్రని తోలులో లైకోపీన్ అనే యాంటిఆక్సిడెంట్‌కు గుండె జబ్బులను నిరోధించే పవర్ ఉన్నదట. కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం కూడా ఉంది. ఇన్ని శక్తులున్నటువంటి టమేటో పండు నుంచి ఓ మాత్రను తయారు చేశారు.

ఈ మాత్ర తీసుకున్నవారిలో కొలెస్ట్రాల్ క్రమంగా సాధారణ స్థాయికి వస్తుంది. రక్తంలో ఉన్న కొవ్వును సాధారణ స్థితికి తెస్తుంది. తొలిదఫా ప్రయోగాత్మకంగా గుండె జబ్బుతో బాధపడుతున్న 150 మందిపై ప్రయోగించారు. వారిలో క్రమంగా గుండె జబ్బు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టడాన్ని గమనించారు.

ఈ మాత్రను మార్కెట్లోకి విడుదల చేయాలంటే ఇంకా మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు. ప్రయోగాలలో తాము అనుకున్న ఫలితాలు నూటికి నూరు శాతం వస్తే... మాత్రను త్వరలో అందుబాటులోకి తెస్తామంటున్నారు.

వెబ్దునియా పై చదవండి