ముఖ రంగును బట్టి భావాలను అంచనా వేయొచ్చు...

బుధవారం, 21 మార్చి 2018 (11:36 IST)
ముఖవర్ణాన్ని బట్టి భావాలను తెలుసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. కనుబొమ్మలు, చెక్కిళ్లు, దవడకు జరిగే రక్త ప్రసరణ ద్వారా ముఖవర్ణంలో సంభవించే మార్పుల ద్వారా ఆ వ్యక్తి ఎలాంటి అనుభూతులు పొందుతున్నాడో 75 శాతం వరకు అంచనా వేయవచ్చునని ఓహియో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
కండరాల కదలికను బట్టి ముఖ కవలికలుంటాయని.. ముఖ వర్ణాన్ని బట్టి భావాలను కనిపెట్టవచ్చునని ఓహియో పరిశోధకులు తెలిపారు. ముఖ వర్ణాన్ని బట్టి, కదలికలను బట్టి సంతోషం, దుఃఖాన్ని అంచనా వేయవచ్చునని పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఈ పరిశోధనలో వందలాది మందిపై పరిశోధనలు చేశామని.. రంగులను బట్టి కంప్యూటర్ పరిశోధన జరిగిందని పరిశోధకులు చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు