కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

ఠాగూర్

బుధవారం, 6 ఆగస్టు 2025 (20:01 IST)
ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎప్-95 కింద చెల్లించే కనీస మొత్తాన్ని రూ.7 వేలకు పెంచాలని ఎప్పటినుంచి డిమాండ్లు వస్తున్నాయని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి మన్‌సుక్ మాండవీయ అన్నారు. ఆయన బుధవారం విశాఖపట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, పెన్షనర్ల కనీస పెన్షన్ నిర్ణయంపై కేంద్రం త్వరలోనే కీలక ప్రకటన చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 
 
ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎస్-95 కింద చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. పెన్షన్ మొత్తాన్ని కనీస పెన్షన్ రూ.7 వేలకు పెచాలని ఈపీఎస్-95 ఆందోళన కమిటీ ఎప్పటి నుంచో కోరుతోందన్నారు. ఢిల్లీ వేదికగా పలుమార్లు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా నిర్వహించారన్నారు. పెన్షనర్లు, వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్ని డిమాండ్ కూడా ఉందన్నారు. కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలో 80 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు