శృంగార సామర్థ్యాన్ని పెంచేదిగానూ, నేచురల్ వయాగ్రా గానూ బీట్‌రూట్‌ను పిలుస్తారు. నైట్రేట్స్ పుష్కలంగా కలిగిన ఈ బీట్‌రూట్‌ను తీసుకోవడం ద్వారా నైట్రిక్ యాసిడ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శృంగార హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
ఇంకా గర్భం ధరించిన మహిళలకు బీట్‌రూట్ ఎంతగానో మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ను గర్భిణీలు రోజూ తీసుకోవడం ద్వారా శిశువు వెన్నెముక, ఎముకలు బలపడతాయి. ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గర్భిణీలకు తగిన ఎనర్జీని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.