ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో రక్తపోటుతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రక్తపోటు (బీపీ) కారణంగానే గుండెపోటు వస్తున్నట్టు వైద్యులు అంటున్నారు. అయితే, బీపీని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే గుండెపోటును నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తాజాగా, బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడించిన నివేదిక ప్రకారం రక్తపోటును సరైన సమయంలో గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకోకపోవడం కారణంగానే చాలా మంది చనిపోతున్నారు. సరైన చికిత్స అందిస్తే ఏటా 1.15 లక్షల మందిని కాపాడొచ్చు. ప్రపంచంలో లక్షలాది మందికి రక్తపోటు ఉందనే విషయం కూడా తెలియదు. గడిచిన కొన్నేళ్లలో ఎంతో మంది సరైన చికిత్స తీసుకోకపోవడంతో చనిపోయారు.
అయితే.. రక్తపోటుపై అవగాహన లేక చికిత్సను నిరక్ల్యం చేస్తే వేలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీన్ని నివారించాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, రక్తపోటుపై అవగాహన కల్పించాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవాలి. కొందరికి రక్తపోటు ఉన్నా గుర్తించడం కష్టమని, ఆరోగ్యం హెల్త్ చెకప్ ద్వారా దీన్ని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.