నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. అంతేగాకుండా టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, మానసిక స్థితి మెరుగ్గా వుంటుందని.. హృదయ సంబంధిత వ్యాధులను కూడా ఇది నివారిస్తుందని జర్నల్ ఏజింగ్‌లో ప్రచురితమైన అధ్యయనం ద్వారా తెలిసింది.
ఇందుకోసం ఏర్పడిన పరిశోధనా బృందం 60, అంతకంటే ఎక్కువ వయస్సు గల 36 మంది పెద్దలను ఎంపిక చేసింది. వారి ఆరోగ్యం, జీవనశైలి, మానసిక శ్రేయస్సు గురించి డేటాను సేకరించింది. వారికి నిర్వహించిన న్యూరో సైకలాజికల్ ఎమ్మారై స్కాన్‌ల ద్వారా టీ తాగే వారి మెదడు మెరుగ్గా వుందని.. టీ మెదడుకు ఉత్సాహాన్ని ఇస్తుందని వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం 2015 నుండి 2018 వరకు జరిగింది.