తరగతిలో ఉపాధ్యాయుడి రాసలీలలు .. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

బుధవారం, 11 సెప్టెంబరు 2019 (10:33 IST)
చదువుల తల్లి కొలువైవుండే తరగతి గదిలో ఓ ఉపాధ్యాయుడు పాడు పనికి పాల్పడ్డాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో ఆయన్ను పట్టుకుని చితకబాది, ఆపై పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ఉడుప్పమ్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉడుప్పమ్‌ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్‌.. అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే వీరిద్దరూ గత కొంతకాలం నుంచి పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలో శారీరకంగా కలుసుకుంటున్నట్టు స్థానికులు గుర్తించారు. పలుమార్లు విద్యార్థుల కంట కూడా పడ్డారు. 
 
ఈ విషయాలను ఆయన తమ తల్లిదండ్రులకు కూడా చెరవేశారు. మొత్తంగా ఉపాధ్యాయుడి రాసలీలను గ్రామస్తులు పసిగట్టి మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం టీచర్‌కు దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు