ఫ్రై చేసిన చికెన్, చేపలంటే చాలామందికి ఇష్టం. కొంతమంది లొట్టలేసుకుని తింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటిల్లిపాది చికెన్ లేకుంటే చాపలు, లేకుంటే ఇతరత్రా మాంసాలను తెచ్చుకుని తింటుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో ఫ్రై చేసిన చికెన్, చేపలు తింటే వచ్చే అనర్థాలు వివరించడం అందరిలోను ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఫ్రైడ్ చికెన్, చేప తినే మహిళలకు గుండెజబ్బు, క్యాన్సర్లు త్వరగా రావడం ఖాయమంటున్నారు వాషింగ్టన్‌కు చెందిన ఉమెన్స్ హెల్త్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన వైద్యులు. లక్షా 10వేలమంది మహిళలను పరీక్షిస్తే ఫ్రై చేసుకుని చికెన్, చేపలు తిన్న వారిలో గుండె జబ్బు, క్యాన్సర్ లాంటి లక్షణాలు వచ్చాయని కనిపెట్టారట.