యూ.ఎస్‌లో ప్రతి 12 ఊబకాయం కేసుల్లో ఒకరికి, అలాగే యూ.కేలో ప్రతి 20 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందని తెలియజేస్తోంది. యూఎస్‌లోని మూడింట రెండు భాగాల జనాభాపై జరిపిన అధ్యయనంలో ఊబకాయం దాదాపు అర డజను క్యాన్సర్‌లకు మూలకారణమని, ఈ సంఖ్య 1995 నుండి 2015 మధ్య 50 సంవత్సరాలలోపు ఉన్న స్త్రీ, పురుషుల్లో తరచుగా వచ్చిందని పేర్కొంది.
లాన్‌సెట్ అనే మెడికల్ జర్నల్‌లో తక్కువ వయస్సులోనే క్యాన్సర్ వస్తోందని నివేదించబడింది. పరిశోధించిన సమయంలో 45 నుండి 49 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 1 శాతం సంభవించగా, 30 నుండి 34 సంవత్సరాల మధ్య ఉన్న వారికి సంవత్సరానికి దాని కంటే రెండు రెట్లు అధికంగా నమోదైంది. కాగా 25 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారి రేటు 4.4 శాతానికి ఎగబాకింది.
ఈ క్యాన్సర్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా ధూమపానం మరియు అంటువ్యాధులు కారణంగా వస్తున్నాయి. దాదాపు 30 రకాల క్యాన్సర్లలో 12 రకాలు ఊబకాయం వలన కలుగుతున్నాయి. మరోవైపు జంక్ ఫుడ్ కారణంగా కూడా క్యాన్సర్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల శరీరం బరువు పెరిగి వివిధ రకాలైన క్యాన్సర్ రావడానికి కారణం అవుతున్నాయి. మితిమీరిన ఆహారపు అలవాట్ల కారణంగా కూడా ఊబకాయం వస్తోంది. సరైన పద్ధతిలో ఆహార నియమాలను పాటించకపోతే మరింత విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.