ఈ పథకానికి అర్హులు ఎవరు?
అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకానికి... పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు అర్హులు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతోగానీ, రేషన్‌కార్డుతోగానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ నంబర్ నమోదు తప్పనిసరికాదు.