70 శాతం భారతీయులు ఆ సమస్యతో గోక్కుంటున్నారు... సర్వే

గురువారం, 22 జూన్ 2017 (19:33 IST)
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చుండ్రు సమస్య. ఉదయం లేచిన దగ్గర్నుంచి తల గోక్కుంటూ చాలామంది ఇండియన్స్ కాలం వెళ్లదీస్తున్నారంటూ తాజా సర్వే తెలిపింది. చుండ్రు సమస్యతో 70 శాతం భారతీయులు బాధపడుతున్నట్లు తేల్చింది.
 
చుండ్రు సమస్యపై క్లియర్ ప్యారిస్ ఇనిస్టిట్యూట్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 70 శాతం ఇండియన్స్ ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు తేలింది. చుండ్రు సమస్య అధికంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వున్నవారిలో ఎక్కువగా వున్నట్లు తేలింది. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి