ఇదెక్కడి గోలండీ బాబూ... ఏదయినా తింటే లావయిపోతారని చెప్తుంటారు. కానీ వాసన చూస్తేనే లావయిపోతారని అంటున్నారు పరిశోధకులు. ఇంతకీ వేటిని వాసన చూస్తే లావయిపోతారో తెలుసుకుందాం. పరిశోధకులు అధిక బరువుతో బాధపడేవారిపై పరిశోధనలు చేయగా... రుచికరమైన పదార్థాలను విపరీతంగా వాసన చూడటంతో శరీరంలో కొవ్వు కూడా పేరుకున్నదట.
ముక్కుపుటాలను అదరగొడుతూ మంచి సువాసన కలిగిన పదార్థాలను అదే పనిగా వాసన చూస్తే శరీరం కొన్ని క్యాలరీల శక్తిని గ్రహిస్తుందట. ఫలితంగా శరీరంలో క్యాలరీలు వాంటతట అవే పెరిగిపోతాయట. ఐతే తినకుండానే ఇది ఎలా సాధ్యం అనేదానిపై పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మరోవైపు వాసన గ్రహించే శక్తిని కోల్పోయినవారిని చూసినప్పుడు వారు సన్నగా పీలగా వున్నట్లు తేలిందంటున్నారు.