సాధారణంగా ఏ, బీ, ఎబీ, ఓ బ్లడ్ గ్రూపుల గురించే మనం వినివుంటాం. కానీ దీనికితోడుగా మరో బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 40 మంది దగ్గరమాత్రమే ఉంది. ఈ గ్రూప్ పేరు రీసస్ నెగిటివ్ (RH Null). దీన్నే గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు.
ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను అత్యంత అరుదైన గ్రూపుగా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.