అలసినప్పుడు చాక్లెట్లు తినకండి

కొంతమందికి స్వీట్లు, చాక్లెట్లంటే మహా ప్రీతి. అలాంటి వారి మానసికస్థితిపై చాక్లెట్లు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యేవారు లేదా త్వరగా అలసిపోయేవారు చాక్లెట్లను ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. చాక్లెట్లు తీసుకుంటే ఒత్తిడిని పెంచేస్తుందని వారు సూచిస్తున్నారు.

చాక్లెట్లు, కెఫిన్ ఉన్న పదార్థాలను అధికంగా తీసుకునే వారి మానసిక పరిస్థితి చాలా ప్రమాదకర పరిస్థితిలోకి చేరుకుందని, ఇది ఒత్తడికి లోనైన వారికన్నాకూడా ఎక్కువేనని మానసిక స్థితిపై పరిశోధనలు చేసే సంస్థ మైండ్ పేర్కొంది.

ఆహార పదార్థాలు మనిషి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని, అదే చాక్లెట్లు తినేవారిపై మరింత ప్రభావం చూపించి ఒత్తిడికి గురయ్యేలా చేస్తోందని వారి పరిశోధనలలో బయట పడినట్లు మైండ్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

మానసిక పరిస్థితి, ఒత్తిడికి గురైనవారిపై, తీవ్రమైన ఫోబియాతో బాధపడేవారిపై, సరైన ఆహారం తీసుకోకుండా బాధపడేవారిపై జరిపిన పరిశోధనలు జరిపినామని సంస్థ ప్రకటించింది. తాము జరిపిన పరిశోధనల్లో తేలిన తర్వాత చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని సంస్థ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి