చిన్న పిల్లలకు ఫ్రిజ్‌లోని నీరు ఇస్తున్నారా?

సోమవారం, 17 జూన్ 2019 (14:37 IST)
వేసవి కాలంలో చిన్నారులు, పెద్దలు చల్లని నీరు తాగేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా, ఫ్రిజ్ నీటిని అమిత ఇష్టంగా తాగుతారు. ఇలాంటి చల్లని నీరు పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, చిన్నారుల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అందకుండా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేసవి కాలంలో చల్లని నీటికి బదులు ఇతర ప్రత్యామ్యాయ ద్రవాలను ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. 
 
ఫ్రిజ్ నీరుకు బదులుగా ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ ఇవ్వాలి. నీటిలో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవు. అలాగే, పాలు తక్కువగా తాగుతారో వారికి లాక్టోజెన్ లోపం తలెత్తుతుంది. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలు సోయామిల్క్‌ తాగించాలి. 
 
సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధికం. పిల్లల శారీరక ఎదుగుదల వేగవంతంగా వృద్ధి చెందుతుంది. కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఆల్మండ్‌ మిల్క్‌ ప్రయోజనకరం. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం. తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. 
 
పిల్లల ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్స్‌, పొటాషియం, ఎలక్టో ల్రైట్స్‌ అవసరం. వీటిలో చక్కెరపాళ్లు తక్కువ. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే చర్మ, ఉదర సమస్యలు తలెత్తుతాయి. 
 
పిల్లలకు పుచ్చకాయ, మామిడి, బత్తాయి, ఆపిల్‌ జ్యూస్‌లు చాలాచాలా మంచిది. ఎండాకాలంలో పిల్లల దాహార్తి తీర్చేందుకు నిమ్మరసం ఇవ్వడం మరువొద్దు. చెడామడా తినేస్తున్న పిల్లలకు అప్పుడప్పుడు కడుపులో గడబిడ మొదలవుతుంది. 
 
ఉదర ప్రశాంతత కావాలంటే పల్చటి మజ్జిగ తాగాలి. కడుపులో ఎసిడిటీ తగ్గడంతో పాటు జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది. అప్పుడప్పుడు లస్సీ కూడా తాగొచ్చు. ఇందులో పోషకవిలువలు ఎక్కువ. రుచికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు