మహిళలకు ఎంతగానో ఉపయోగపడే సొరకాయ

శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:37 IST)
సొరకాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సొర ముక్కలను ఆవు నేతిలో వేయించుకుని పరిమితంగా తింటే ఎంతో ప్రయోజనమట. అంతేకాకుండా సొరకాయ ముక్కలను ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకుని ఆ చూర్ణాన్ని అరచెంచాడు.. తేనె అరచెంచాడు కలిపి రెండు పూటలు సేవిస్తే స్త్రీకి బహిష్టు సమస్యలు తగ్గిపోతాయట.
 
సొరకాయలోని పప్పును నీటితో నూరి వేసవిలో కలిగే పగుళ్ళపై పూతగా లేపనంగా రాస్తే తగ్గుతాయట. సొరకాయ, పాలకూర, టమోటాతో వండి తిన్నా, సొరకాయ, మునగకాడలు, మామిడి ముక్కలతోను, సొరకాయ, నువ్వులపొడి, పచ్చికొబ్బరి ఇలా రకారకాలుగా వండి తింటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ముఖ్యంగా తీపి రుచి కలిగి చలువ చేసే స్వభావం సొరకాయలో ఉంటుంది కాబట్టి పైత్య రోగులకు ఉష్ణ శరీరత్వం గల వారికి ఎంతో మేలు చేస్తుందట. సొర ఆకులు మూత్రాన్ని సాఫీగా విడుదల చేస్తాయట. కఫ, వాత శరీరతత్వం గల వారు సొరకాయను తినకూడదట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు