గృహ హింస పెరిగిపోతుంటే.. సానియాకు కోపమొచ్చింది..

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (18:10 IST)
లాక్​డౌన్ నేపథ్యంలో ఒక్కపూట కూడా ఆహారం దొరక్క ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వంటకాల ఫొటోలను ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్​డౌన్ కాలంలో గృహ హింస కేసులు పెరిగినట్టు ఇటీవల నివేదికలు వెల్లడి అయిన తరుణంలో సానియా మీర్జా ఫైర్ అయ్యింది. 
 
మహిళలు ధైర్యంగా ఉండి, పురుషులతో సమానంగా గౌరవం కోసం డిమాండ్ చేయాలని సానియా సూచించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఐక్యంగా వుండి.. పురుషులు, మహిళలను సమానంగా గౌరవంతో చూడలని సానియా తెలిపింది. 
 
గృహ హింసలు పెరిగిపోతున్నాయనే నివేదికలను చూశానని.. ఇలాంటివి అమానుషం. గృహహింసను తాను ఎప్పుడూ తీవ్రంగా ఖండిస్తా. మహిళలను తమతో సమానంగా పురుషులు గౌరవించాలి. మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవం కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మహిళలపై ఉందంటూ సానియా మీర్జా వెల్లడించింది. 
 
తాము రూ.2.5కోట్ల నిధులను సమీకరించి లక్షల మందికి ఆహారం అందించామని, ఇంకా ఎక్కువ మందికి నేరుగా సాయం చేయాలని అనుకుంటున్నానని సానియా మీర్జా తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసినా, సరిపోదని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు