వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకుంటే..?

మంగళవారం, 3 జులై 2018 (22:39 IST)
వాము మంచి ఔషధపు మెుక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన బరువును, కొవ్వును తొలగించడంలో ఇది సహాయపడుతంది. దీని ప్రయోజనాలు ఏమిటంటే......
 
1. ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయానే మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతి రోజు తాగటం వలన శరీర బరువు తగ్గుతుంది.
 
2. ప్రతి రోజు ఒక స్పూన్ వామును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, రకరకాల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
 
3. వాములో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కవుగా ఉంటాయి. వాములో ఉండే తైమల్ అనే రసాయనం బ్యాక్టీరియాను, ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, అలసటకి వాము ఔషధంగా పనిచేస్తుంది.
 
4. వాము ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించటం వలన అజీర్తి సమస్యలు, మలబద్దకం తగ్గుతాయి. వాము నుంచి తీసిన నూనెను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు రాసుకోవటం వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది.
 
5. వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకోవడం వలన జలుబు, కఫం నుంచి  ఉపశమనం పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు