కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే రాజమా గింజలు తీసుకుంటే...

బుధవారం, 24 జులై 2019 (22:18 IST)
ఇటీవలకాలంలో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల ఈ సమస్య సాధారణంగా మారింది. వీటిని నివారించుకోవడానికి మార్గాలు ఏమిటో చూద్దాం.
 
1. తులసి ఆకులకు ఒక టీ స్పూను తేనె కలిపి జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఆరునెలల పాటు ప్రతి రోజు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కిడ్నీలోని రాళ్ల పరిమాణం తగ్గి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి.
 
2. రాజ్మా మన నాలుకకు ఎంత రుచిని ఇస్తాయో, ఆరోగ్యానికి అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి. నాలుగు లీటర్ల నీటిలో మధ్యకు చీల్చిన యాబై గ్రాముల రాజ్మా గింజలను వేసి వీటిని సన్నని మంట మీద ఉంచి మరగనివ్వాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని సుమారు ఎనిమిది గంటల పాటు చల్లబరిచి వీటిని వడకట్టుకుని రోజులో రెండు గంటలకు ఒకసారి ఈ డికాషన్‌ను గ్లాసు చొప్పున తీసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ సమస్యలకు మంచి ఔషదంలా ఉపయోగపడుతుంది.
 
3. ద్రాక్షలో అధిక శాతం నీరు, పొటాషియం, సాల్ట్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయను తీసుకోవడం వలన కూడా కిడ్నీ సమస్య తలెత్తదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు