యాపిల్ తొక్కలో బీపీని తగ్గించే గుణాలు ఆరు రెట్లు ఎక్కువట..

మంగళవారం, 8 నవంబరు 2016 (10:56 IST)
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానవుడు సవాలక్ష రోగాలతో సతమతమవుతున్నాడు. వీటిలో బీపీ(రక్తపోటు) ఒకటి. బీపీను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా అవి శరీరానికి హాని కలిగిస్తాయి. కనుక రోజుకో యాపిల్‌ను తొక్క తీయకుండా తింటే రక్తపోటును తగ్గించుకోవచ్చంటున్నారు. 
 
బీపీను తగ్గించే ఔషధ గుణాలు యాపిల్ తొక్కలో ఆరు రెట్లు ఎక్కువ ఉన్నాయని, కాలంతో సంబంధం లేకుండా దొరికే పండు కనుక రోజుకో యాపిల్ తీసుకోవడం వల్ల బీపీకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యులు. బీపీను తగ్గించుకునేందుకు కొందరు "గ్రీన్ టీ" తాగడం, "బ్లూ బెర్రీస్" తినడం వల్ల, రోజుకో యాపిల్ తినడం ద్వారా ఎటువంటి హానీ లేకుండా బీపీను తగ్గించుకోవచ్చంటున్నారు. 
 
రక్తపోటుతో బాధపడేవారు బీట్‌రూట్‌ రసాన్ని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందని రుజువు చేశారు. ఈ రసం రక్తంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ శాతాన్ని పెంచుతుందని నిర్థారణ అయింది. సాధారణంగా ఇది ప్రకృతి సిద్ధమైన దుంపకూర. దానివల్ల ఇతర దుష్ప్రభావాలేమీ ఉండవు. అందులో సమృద్ధిగా ఉండే నైట్రేట్‌ గుండె కవాటాలకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి