ఇంగువ చేసే మేలు తెలిస్తే వదిలిపెట్టరు...(video)

గురువారం, 16 జనవరి 2020 (20:50 IST)
ఇంగువను తింటే చాలా లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే చాలామంది ఇంగువను తినడానికి ఇష్టపడరు. చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు. కానీ ఇంగువ తింటే మన శరీరంలో మనకు తెలియకుండానే ఎన్నో ఉపయోగాలు కలుగుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 
 
ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పొడిలోని యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను పూర్తిగా తగ్గిస్తాయట.
 
అంతేకాదు తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడి నీటిలో ఇంగువ పొడి కలుపుకుని తాగితే త్వరగా తగ్గుతుందట. అలాగే బెల్లంతో ఇంగువను తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుందట. ఇంగువను తప్పకుండా వాడుతూ ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు