బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి. పిల్లలకు బార్లీ నీరు పట్టించడం ద్వారా మూత్రం నుంచి వచ్చే దుర్వాసన రాకుండా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలుండవు. ఇంకా హార్మోన్లకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. అజీర్తి, కడుపు మంట, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుండే వారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
బార్లీ పొడిలో ఉండే బీటా గ్లూకాన్ పీచు గోధుమ పిండిలో గ్లైసమిక్ ఇండెక్స్ స్థాయిలను తగ్గిస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగకుండా చేస్తుంది. బరువు త్వరగా తగ్గాలనుకునే వారు సాధారణంగా ఓట్స్ తీసుకుంటారు. అయితే ఓట్స్ కన్నా బార్లీ వల్ల ఆరోగ్యవంతంగా, వేగంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.