చాలా మందికి జట్టు అకారణంగా రాలిపోతుంది. ఇక డెండ్రాఫ్ (చుండ్రు) సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పెరుగుతో చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు ఆరగిస్తే చలువదనం. పైగా బాగా నిద్రపడుతుంది కూడా. అలాంటి పెరుగుతో జుట్టును ఏ విధంగా సంరక్షించుకోవచ్చో తెలుసుకుందాం.
కప్పు పెరుగులోకి బాగా పండిన అరటిపండును కట్ చేసి వేసిన తర్వాత మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. దీనికి నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను జతచేయాలి. జుట్టుకు పట్టించి వైడ్ టూత్ దువ్వెనతో దువ్వుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టేంత వరకూ ఆరబెట్టుకోవాలి. కనీసం అరగంట అలా ఉంచుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్య ఉండదు. మరింత గట్టిగా కుదుళ్లు ఉంటాయి.