ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగితే..

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:34 IST)
కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుందని ఆరోగ్య  నిపుణులు. నిమ్మకాయలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. సగం నిమ్మచెక్క రసం తీసుకున్నా రోజుకు అవసరమైన విటమిన్‌ సిలో ఆరో వంతుకు పైగా అందుతుంది.
 
నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. నాడులు-కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందటానికి, వ్యర్థాలను బయటకు పంపటానికీ ఇది తోడ్పడుతుంది. రక్తపోటుపై ఉప్పు చూపే ప్రభావాన్ని తగ్గించటానికీ మెగ్నీషియం ఉపయోగపడుతుంది.
 
రోగనిరోధకశక్తిని పుంజుకునేలా చేయటంతో పాటు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గాయాలు త్వరగా మానటానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు