ద్రాక్షపండు, నారింజ, నిమ్మకాయలతో సహా పుల్లని పండ్లు రక్తపోటు తగ్గించే శక్తివంతమైన ప్రభావాలను కలిగి ఉంటాయి.
గుమ్మడికాయ గింజలు చిన్నవిగా ఉండవచ్చు, కానీ రక్తపోటు తగ్గించే గుణాలు వున్నాయి.
బీన్స్, కాయధాన్యాలలోని ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటివి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
క్యారెట్‌లో క్లోరోజెనిక్, కెఫిక్ యాసిడ్‌లు రక్త నాళాలను సడలించడం, వాపును తగ్గించడంలో సాయపడతాయి. రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
బచ్చలికూరలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో నిండి వుంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది అద్భుతమైన ఎంపిక