నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకుంటే...

గురువారం, 25 ఆగస్టు 2016 (11:33 IST)
కొంతమందికి శరీరంపై వివిధ భాగాలు నల్లగా మారుతుంది. ఎండలో బయటికి వెళ్తే చాలు…చర్మంపై మంట పుడుతుంది. ఎండ తాకిడికి చర్మం నల్లగా మారుతుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు కూడా ఏర్పడుతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్యలుగా చెబుతుంటారు. అయితే వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజు స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకొని ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే నల్లమచ్చలు తగ్గిపోతుంది..
మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను రోజూ వారీ డైట్ లో చేర్చుకోవాలి. 
బయటకు వెళ్లటానికి 30 నిమిషాల ముందే సన్ క్రీమ్ లోషన్ ముఖానికి తప్పకుండా రాసుకోవాలి.
పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 

వెబ్దునియా పై చదవండి