ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం దరిచేరదని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. సాధారణంగా కాకరకాయ వంటకాలను తినడానికే కాసింత చక్కెర లేదా బెల్లం వేసి తయారుచేస్తుంటారు. అలాంటి కాకరకాయ రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చక్కెర వ్యాధి (మధుమేహం) సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. చక్కెర వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు తినాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాధికి కాకరకాయ రసంతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.