సొరకాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

శనివారం, 14 జనవరి 2023 (22:51 IST)
సొరకాయని అనపకాయలని కూడా అంటారు. పొడవుగా ఉండే సొరకాయలు, కుదిమట్టంగా ఉండే అనపకాయలు రెండూ ఒకే గుణాన్ని కలిగివుంటాయి. ఎక్కువగా సొరకాయ కూరను తింటుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సొరకాయతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
సొరకాయ శరీరానికి చల్లదనాన్నిస్తుంది, శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది.
 
సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
 
నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.
 
మూత్రనాళ జబ్బులకు, మలబద్ధక, కాలేయ సమస్యలు ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.
 
హృదయ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం.
 
సొరకాయ కూరకి శొంఠి పొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకునే వారికి జలుబు చేయదు.
 
సొరకాయ ముదురు గింజలను వేయించుకుని, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి అన్నంలో కలుపుకుని తింటే పురుషులకు చాలా మంచిది.
 
గమనిక: ప్రత్యేకించి సొరకాయ జ్యూస్ తాగేవారు వైద్య నిపుణుడిని సంప్రదించిన తర్వాత ఆచరించాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు