ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
ఒక స్పూన్ తేనెకు అర టీస్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి, ఉదర సంబందిత సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది.
బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.