పంచదార రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే ఆరోగ్యం చెడిపోతుందనేది తెలిసిందే. రకరకాల పద్ధతుల్లో శుద్ధి చేయడం ద్వారా లభించే తెల్లని చక్కెరకు మనం ఇప్పుడు బాగా అలవాటు పడిపోయాం. అయితే మనం ఏరకం చక్కెర తింటున్నాం అనేదాన్ని బట్టి శరీరంపై ప్రభావం ఉంటుంది. చక్కెర, బెల్లం, తాటిబెల్లం, కొబ్బరి చక్కెర, కార్న సిరప్ ఇవన్నీ కూడా మొక్కల నుంచి తీసినవే. కాకపోతే శుద్ధి చేసి వేరుపరచినవి.