వంటకాల తయారీలో రుచికి, సువాసనకు ఉపయోగపడే సుగంధ ద్రవ్యంగానే కాక దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకములైన అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపే ఔషధం లవంగాలు. ఇది మన శారీరక, మానసిక దోషాలను సమన్వయపరచి సమస్థితిలో ఉంచే లక్షణం లవంగంలో ఉంది. లవంగాన్ని వేయించి ఔషధంలా వాడుకోవాలి. లవంగం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని పావు టీ స్పూను నెయ్యి, అర టీస్పూను తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. అంతేకాకుండా దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.
3. లవంగాల పొడి, జాజికాయల పొడి, జీలకర్ర పొడి, పంచదారలను ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూటకు ఒక గ్రాము పొడిని తగినంత తేనె కలిపి సేవించడం వల్ల రక్తవిరేచనాలు, జిగురు, బంక, కడుపునొప్పితో కూడిన విరేచనాలు, విరేచనాలు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు కావడం వంటి సమస్యలు తగ్గిపోతాయి.