ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్ర లేవడంతోనే బిజీ బిజీగా పనులలో మునిగిపోతున్నారు. అందువల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉదయం లేవడంతోనే కాఫీ, టీలతో రోజుని ప్రారంభిస్తున్నారు. కాఫి, టీలు నిద్రమత్తుని వదిలించడానికి, యాక్టివ్‌గా ఉండడానికి సహకరిస్తాయి కానీ వీటికంటే ముందు నిద్ర లేవడంతోనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. పరగడుపున తేనె నిమ్మ రసం త్రాగడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగు పడడంతో పాటుగా, వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
3. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు ఖాళీ అయి ప్రశాంతతను సమకూరుస్తుంది. ముందు రోజు మసాలాలు లాంటివి తిన్నప్పుడు అవన్నీ శుభ్రం అయి కడుపు ఉబ్బరం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడంలో కూడా నిమ్మ ఎంతగానో సహాయపడుతుంది.