కొబ్బరి నీళ్లతో మధుమేహ వ్యాధికి చెక్...

గురువారం, 23 ఆగస్టు 2018 (10:18 IST)
కొబ్బరి నీళ్లు అలసట నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఉపయోగపడుతాయి. అన్ని కాలాల్లోనూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారికి కొబ్బరి నీళ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు నీటిని, మలినాలను తొలగిస్తాయి.
 
కొబ్బరి నీళ్లను తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. సర్జరీ అయినవారికి, అనారోగ్య సమస్యలున్న వారికి కొబ్బరి నీళ్లు చాలా దోహదపడుతాయి. ప్రతిరోజూ గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన లవణాలు, విటమిన్స్, ఎలక్రోలైట్లు అందుతాయి. తరచుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
కొబ్బరి నీళ్లలోని గుణాలు కిడ్నీల్లో రాళ్లను కరిగించుటకు చాలా సహాయపడుతాయి. మూత్రపిండాలను సంరక్షిస్తాయి. కొబ్బరి నీళ్లలో చక్కెర పాళ్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుచేత డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు