అవగాహన లేని వ్యాయామం నిష్ఫలం... ఎందుకంటే...

బుధవారం, 22 ఆగస్టు 2018 (12:42 IST)
సాధారణంగా జీవనశైలికిభిన్నంగా కూర్చొని చేసే ఉద్యోగాలు.. వేళాపాళా లేకుండా భోజనం చేయడం, స్మార్ట్‌ఫోన్‌ ప్రభావంతో నిద్రలేమి.. ఇలాంటి కారణాల వల్ల అనేక మంది లావెక్కిపోతున్నారు. వృత్తిపరంగా తీవ్ర ఒత్తిడికీ గురవుతున్నారు. వీరిలో చాలామంది ఉపశమనం కోసం వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు.
 
ఉదయమే లేచి రెండు కిలోమీటర్లు నడవాలి... సైక్లింగ్‌ చేయాలి... జిమ్‌కు వెళ్లాలి.. ఇలా ఏదో ఒక విధంగా శ్రమపడి బరువును తగ్గించుకోవాలని నగరవాసులు భావిస్తున్నారు. అవగాహన లేకుండా వ్యాయామం చేయడం నిష్ఫలం అవుతోందని ఫిట్నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు. శరీర బరువుకు అనుగుణంగా కసరత్తులకు సమయం కేటాయిస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చని చెబుతున్నారు. 
 
చాలామంది వారి బరువు తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. వేగం, శ్రమించే స్థాయిని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లడం లేదు. ఫలితంగా శరీరానికి అందే క్యాలరీలు, ఖర్చయ్యే వాటికి మధ్య సంబంధం లేకుండా పోతోంది. అరగంట పాటు సైక్లింగ్‌ చేయడం వల్ల 200-300 క్యాలరీలు ఖర్చవుతాయి. 
 
సైక్లింగ్‌ చేయడంలో వేగం పెంచడం వల్ల క్యాలరీలు ఎక్కువ మొత్తంలో కరుగుతాయి. గంటలకు 12-14 కి.మీ. వేగంతో సైకిల్‌ తొక్కితే 240-355 క్యాలరీలు ఖర్చవుతాయి. అదే నడకను తీసుకుంటే గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో నడిస్తే... 135- 200 క్యాలరీలు, గంటకు 4.5 కి.మీ. వేగంతో నడిస్తే 150- 230 క్యాలరీలు కరుగుతాయని ఫిట్నెస్‌ శిక్షకులు చెపుతున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు