చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధారణ జలుబు అయినప్పటికీ దానిపట్ల శ్రద్ధ వహించాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు.
* తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు.
* తల, శరీరం నొప్పులు, జ్వరం వంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.