పచ్చి మిరపకాయలో ఎన్ని ప్రయోజనాలో....

శుక్రవారం, 27 జులై 2018 (10:38 IST)
పచ్చి మిరపకాయలను అధికంగా కూరల్లో వాడుతుంటాం. ఎండు కారానికి బదులుగా ఈ మిరపకాయలను వాడుతుంటారు. పచ్చి మిరప వలన కూరలకు చక్కని రుచివస్తుంది. ఈ క్రమంలో కొందరు మజ్జిగలో కూడా వీటిని ఆరగిస్తారు. మరి పచ్చి మిరపకాయలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది. ఈ మిరపలో విటమిన్ బి6, ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడంతో పాటు జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఈ మిరపలో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.
 
పచ్చి మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ శరీర మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక కొవ్వును కరిగిస్తుంది. గుండె కొట్టుకునే వేగం సక్రమంగా సాగుతుంది. ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి. గాలి బాగా పీల్చుకోవచ్చును. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చిమిరపను తీసుకుంటే ఇలాంటి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు