పుచ్చకాయలు వేసవి కాలం రాగానే దర్శనమిస్తాయి. వీటిని తింటూ హాయిగా దాహార్తిని తీర్చకుంటుంటాం. ఐతే కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో వీటిని కొనాలన్నా భయపడుతున్నారు. ఐతే పుచ్చకాయలను కొనుక్కుని వచ్చి వాటిని శుభ్రంగా ఉప్పు నీటితో కొద్ది సేపు కడిగి ఆ తర్వాత ఓ నాలుగైదు గంటల తర్వాత ముక్కలుగా కోసుకుని తినవచ్చు. ఐతే శుభ్రపరచడంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నప్పటికీ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వుండాలి మరి.
ఇకపోతే పుచ్చ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.
7. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికల క్రమబద్దీకరణలో పుచ్చగింజలు తోడ్పడుతాయి.