హైబీపి ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే?

సోమవారం, 11 జూన్ 2018 (10:32 IST)
చాలామంది తమకు బీపి ఉందన్న విషయం తెలియకుండా అలానే ఉండిపోవడంతో భవిష్యత్తులో అది గుండెపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి వాటికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతవరకు వ్యాధులను నివారించవచ్చును. అవేంటో తెలుసుకుందాం.
 
అధిక రక్తపోటుకు ప్రధాన శత్రువు ఉప్పు, మనం రోజూ వాడే ఉప్పులో ఉండే సోడియం రక్తంలో ద్రవాభిసరణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్త తీవ్రత పెరుగుతుంది. అధికరక్తపోటు సమస్య ఉన్నవారు వీలైనంతవరకు ఉప్పును తక్కువ వాడటం ఉత్తమం. ఇంకా చెప్పాలంటే రక్తపోటు ఉన్నవారు రోజుకు 5 మిల్లీ గ్రాములు ఉప్పును మాత్రమే వినియోగించాలి.
 
పెరుగన్నం తినేటప్పుడు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. పండ్ల రసం తీసుకునేవారు ఉప్పును వాడడం తగ్గించుకుంటే మంచిది. అలాగే చిప్స్, మిక్చర్ లాంటి వాటిలో ఎక్కువగా ఉప్పును వాడుతారు కాబట్టి వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావున వీలైనంతవరకు ఉప్పును తక్కువగా వాడడం అలావాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు