ఉదయాన్నే వ్యాయామం చేస్తున్నారా... ఈ చిట్కాలను పాటిస్తే...

శనివారం, 9 జూన్ 2018 (11:29 IST)
పచ్చటి గార్డెన్‌లో వ్యాయామం చేయుట వలన మెదడుకు ఎంతో మంచిదని పరిశోధనలో వెల్లడైంది. పచ్చటి ప్రాంతాల్లో సహజమైన గాలి, కాలుష్యరహిత ప్రాంతాల్లో వ్యాయామం చేయడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పచ్చటి వాతావరణంలో 5 నిమిషాల పాటు వ్యాయామం చేసిన వారికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరగడంతో పాటు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే వ్యాయామం చేయడం వలన పొందే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
 
రెగ్యులర్ వ్యాయామం చేయుటవలన జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. మీరు చురుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. ఇలా వ్యాయామం చేయడం వలన రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. క్యాలరీలను తొలగించటానికి చాలా మంచిది. మీరు అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి భయటపడాలంటే ఉదయాన్నే వ్యాయామం చేయడం ప్రారంభించాలి. 
 
బాడీ మెటబాలిజంకు కావలసిన శక్తిని అందించడంతో వ్యాయామం సహాయపడుతుంది. శరీరంలో రక్తప్రసరణకు మంచిది. రోజు వ్యాయామం చేయుటవలన బోలు ఎముకల వ్యాధి, కీళ్ళనొప్పులు వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు, కండరాలను బలోపేతం చేసేందకు సహాయపడుతుంది. అంతేకాక మీ కాళ్లు, తుంటి ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు