ఎగ్జిమా నివారణకు చిట్కాలు..

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:05 IST)
ఎగ్జిమా వైద్య పరిభాషలో దీనిని తామర, గజ్జి అని కూడా అంటారు. ఇది చర్మానికి వచ్చే ఒక వ్యాధి. స్కిన్ ఎర్రగా కమిలిపోవడం, దురదపుట్టడం, చికాకు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని డెర్మటైటిస్ అని పిలుస్తారు. ముఖ్యంగా 5ఏళ్ళ లోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖం మీద ఎగ్జిమా ర్యాషస్ కనిపిస్తాయి. ఇది క్రమంగా చేతులకు, కాళ్లకు, పాదాలకు వ్యాపిస్తుంది. 
 
పెద్దవాళ్లలో గమనించినట్లయితే ఎక్కువగా మోకాళ్లు, మోచేతుల వద్ద సంక్రమిస్తుంది. ఎగ్జిమాకి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జన్యు పరంగా రావచ్చు, ఆస్త్మా ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇతరుల్లో విటమిన్ బి6 లోపించినప్పుడు, రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు ఎగ్జిమా లక్షణాలు కనబడుతాయి. వాతావరణంలో ఎక్కువ వేడి, ముఖ్యంగా ఎండా కాలంలో, తరచూ ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఒత్తిడి మొదలగునవి ఎగ్జిమాకు దారితీస్తుంది. ఎగ్జిమాను నివారించుకోవడానికి స్నానం ఒకటి చేస్తే సరిపోదు. 
 
స్నానం చేసే పద్ధతిని మార్చాలి. గోరువెచ్చని నీటిలో ఒక కప్పు మినిరల్ ఆయిల్‌ను వేసి స్నానం చేయాలి. అలాగే ఓట్ మీల్ మిక్స్ వేసి కూడా స్నానం చేయవచ్చు. పాలు, ఆలివ్ ఆయిల్ సమంగా కలిపి వేడినీళ్ళలో కలిపి స్నానం చేస్తే ఎగ్జిమా నయం అవుతుంది. పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఎగ్జిమాను ఎఫెక్టివ్‌గా నివారిస్తుంది. 
 
ఒక టేబుల్ స్పూన్ పసుపులో 3 చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి చర్మానికి పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే ఎగ్జిమా తగ్గుతుంది. స్కిన్ ఇరిటేషన్ మరియు ఇన్ఫ్లమేషన్ ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును రాసినా కూడా ఎగ్జిమా దూరమవుతుంది. 
 
ఎగ్జిమా సమస్యలతో బాధపడేవారు కొబ్బరినూనె, జోజోబ ఆయిల్‌ను గోరువెచ్చని నీళ్ళలో వేసి స్నానం చేయాలి. ఈ నూనెతో మసాజ్ చేయకూడదు. నూనెను కాస్త అప్లై చేసి స్నానం చేయాలి. గ్లిజరిన్ కూడా ఎగ్జిమాను నివారిస్తుంది. దానిని కొద్దిగా నీటిలో కలిపి ప్రభావిత ప్రాంతంలో పూయాలి. 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు