రోజూ పరగడుపున 10 కరివేపాకుల్ని నమిలి తింటే.. 3 నెలల్లో?

సోమవారం, 27 ఏప్రియల్ 2015 (16:14 IST)
కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో ఎ, బీ, సీ, క్యాల్షియం వంటి విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకులో అమినో ఆసిడ్స్ ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా మనం తీసుకునే ఆహారాల్లో కరివేపాకును ఎక్కువగా వాడటం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించడంలో భేష్‌గా పనిచేస్తుంది.

కరివేపాకులోని యాంటీ-యాక్సిడెంట్లు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. కరివేపాకును రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కరివేపాకు ఆయిల్‌ను తలకు కూడా రాసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.  
 
సాధారణంగా 100 గ్రాముల కరివేపాకును రుబ్బి రసాన్ని తీసుకుని టెంకాయ నూనెతో కలిపి వేడిచేసి రోజూ తలకు రాసుకుంటే శరీర వేడి తగ్గుతుంది. జుట్టు నెరవదు. కంటి దృష్టి లోపాలుండవు. కరివేపాకును రుబ్బుకుని పచ్చడి చేసుకుని తినడం ద్వారా గుండె సంబంధిత రోగాలను, రక్తపోటును కూడా దూరం చేసుకోవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉదయం 10 కరివేపాకుల్ని.. సాయంత్రం 10 కరివేపాకుల్ని నమిలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ పరగడుపున 10 కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే 3 నెలల్లో బరువు తగ్గవచ్చు. ఇంకా కరివేపాకు రక్తంలోని కొవ్వును కరిగిస్తుంది. కరివేపాకు పచ్చిగా నమిలి తినడం ద్వారా గొంతు బాగా పనిచేస్తుంది. జలుబు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి