మెంతికూర, మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి. అజీర్తికి విరుగుడుగా పనిచేస్తాయి. మెంతిలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కామెర్లు, రక్తక్షీణత వంటి వాటికి మెంతులు విరుగుడుగా ఉంటాయి.
వేడిగడ్డలు, చీముగడ్డలు లేస్తే నొప్పి భరించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులలో మెంతులు నూరి గడ్డలకు కడితే ఉపయోగం చాలా ఉంటుంది. గడ్డ పరిపక్వానికి వస్తుంది. పగిలిపోవడానికి దోహదపడుతుంది. అప్పుడు చాలా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా నొప్పి పోటు తగ్గుతుంది. మెంతిగింజల కషాయం జ్వరానికి బాగా పనిచేస్తుంది.