చాక్లెట్ తినడమనేది చాలామంది పెద్దవాళ్ళల్లో అపోహ ఉంది. చాక్లెట్‌లు తినడానికి తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కాని మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు, పెద్దలకుకూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు.
చాక్లెట్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని బ్రిటీష్ డైటిక్ అసోసియేషన్ పేర్కొంది. ముఖ్యంగా మిల్క్ చాక్లెట్‌లలో కాల్షియం, విటమిన్ బి2, బి12 పుష్కలంగా వుంటాయని, వీటితోబాటు మెగ్నీషియం, రాగి, ఇనుములాంటివి డార్క్ చాక్లెట్‌లలో పుష్కలంగావుంటాయని, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు.